Header Banner

జైలులో ఆ నోటి దూల మాజీ ఎమ్మెల్యే ఆరోగ్య పరిస్థితి విషమం! ఆసుపత్రికి తరలింపు..!

  Sun May 04, 2025 09:42        Politics

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ఆరోగ్యం క్షీణించింది. ప్రస్తుతం విజయవాడ సబ్‌ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన.. ఆరోగ్య సమస్యలతో బాధపడటంతో జైలు అధికారులు తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వంశీ గత కొన్ని రోజులుగా నడుము నొప్పి, కాళ్ల వాపుతో బాధపడుతున్నట్లు సమాచారం. సమస్యలు తీవ్రమవడంతో డాక్టర్లు గుండె సంబంధిత పరీక్షలు, రక్తపరీక్షలు చేశారు. రెండు గంటలపాటు వివిధ వైద్య పరీక్షల అనంతరం ఆయనను తిరిగి జైలుకు తరలించారు.

 

దాదాపు రెండు నెలల నుంచి వల్లభనేని వంశీ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సత్యవర్ధన్ కిడ్నాప్ ఆరోపణలపై వల్లభనేని వంశీ మోహన్‌ను ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టు రిమాండ్ విధించగా.. అప్పటి నుంచి వల్లభనేని వంశీ రిమాండ్‌లో ఉన్నారు. మరోవైపు ఆయనపై పలు కేసులు నమోదవుతూ ఉండటంతో రిమాండ్ కొనసాగుతోంది.

 

ఇది కూడా చదవండి:  ఏపీ ప్రజలకు శుభవార్త! రూ.3,716 కోట్లతో.. ఆ రూట్లో ఆరు లైన్లుగా నేషనల్ హైవే!

 

2023 ఫిబ్రవరిలో గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి చేసి కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. అంతే కాకుండా అక్కడున్న వాహనాలను తగలబెట్టారు. ఆ సమయంలోనే పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్‌గా ఉన్న సత్యవర్ధన్‌ను వంశీ కులం పేరుతో దూషించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలోనే వంశీపై కేసు నమోదైంది. ఈ కేసు విషయంలో ఆయన కోర్టును ఆశ్రయించగా.. బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు.. వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. సత్యవర్ధన్‌ కిడ్నాప్ వ్యవహారంలో వల్లభనేని వంశీ పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా ఆధారాలు ఉన్నాయని అభిప్రాయపడింది.

 

మరోవైపు వంశీ ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన భార్య సైతం ఇటీవల చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. దీంతో వంశీని బెయిల్ పై విడుదల చేయాలంటూ వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో నేషనల్ హైవే! రూ.647 కోట్లతో.. ఆ రూట్‌లో నాలుగ లైన్లుగా! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సంచలన నిర్ణయం తీసుకున్న OYO హోటల్స్.. మరో కొత్త కాన్సెప్ట్‌తో - ఇక వారికి పండగే..

 

నిరుద్యోగులకు శుభవార్త.. నెలకు రూ.60 వేల జీతం.. దరఖాస్తుకు మే 13 చివరి తేదీ!

 

ఇక బతకలేను.. నా చావుకు కారణం వాళ్లే! ఢీ ఫేమ్ జాను కన్నీటి వీడియోతో కలకలం!

 

ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.వేలు! ఈ పథకం గురించి తెలుసాదరఖాస్తు చేస్కోండి!

 

కూటమి ప్రభుత్వ రాకతో అమరావతి బంగారు బాట! ఇకపై ప్రతి ఆంధ్రుడు..

 

షాకింగ్ న్యూస్.. తెలుగు యూట్యూబర్ అనుమానాస్పద మృతి.. అతనే కారణమా?

 

గుడ్ న్యూస్! ఏపీలోనూ మెట్రోకు గ్రీన్ సిగ్నల్! ఎక్కడంటే?

 

గన్నవరం ఎయిర్‌పోర్టులో మరోసారి కలకలం.. ఈసారి ఏం జరిగిందంటే!

 

ప్రయాణించేవారికి శుభవార్త.. అమరావతికి సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ.. సిద్ధమైన కృష్ణా నదిపై వారధి!

 

అకౌంట్లలో డబ్బు జమ.. 1 లక్ష రుణమాఫీ. ప్రభుత్వం ఆదేశాలు.! గైడ్‌లైన్స్ విడుదల!

 

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #VallabhaneniVamsi #Gannavaram #YSRCP #VamsiArrest #VamsiBail #VamsiHealth